క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2023-01-29T23:50:56+05:30 IST

క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌ అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి
మొయినాబాద్‌: క్రికెట్‌ను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ శ్రీకాంత్‌

మొయినాబాద్‌/షాబాద్‌/కొత్తూర్‌, జనవరి 29: క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌ అన్నారు. మొయినాబాద్‌ మండలంలోని సురంగల్‌ గ్రామానికి చెందిన బేగరి బాబయ్య, యాదయ్యల జ్ఞాపకార్థంగా సురంగల్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదమన్నారు. వచ్చిన అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ఎంఏ రావుఫ్‌, నిర్వహకులు బి.వినోద్‌కుమార్‌, నాయకులు, గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని బోడంపహాడ్‌లో సహారా డిజిటల్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్‌ టోర్నమెంట్‌ను సర్పంచ్‌ కిష్టారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్‌ ఉమర్‌, గ్రామస్థులు రాంచంద్రారెడ్డి, యాదిరెడ్డి, ఇనాయత్‌, నర్సింహులు, భీమయ్య ఉన్నారు. అదేవిధంగా అదేవిధంగా కొత్తూర్‌ మండలంలోని కొడిచర్ల గ్రామంలో నిర్వహించిన కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ విజేతలకు ఆదివారం ఎంపీటీసీ బి. రవీందర్‌రెడ్డి షీల్డ్‌తో పాటు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాషాబాయ్‌, శరత్‌రెడ్డి, శేఖర్‌యాదవ్‌, శివశంకర్‌రెడ్డి, జంగయ్యయాదవ్‌, నర్సింహాగౌడ్‌, యాదయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేష్‌, రాఘవేందర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T23:50:57+05:30 IST