సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’

ABN , First Publish Date - 2023-05-27T00:03:34+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు.

సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’
మాసానిగూడలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి, మే 26 : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే శుభోదయం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని మాసానిగూడ, మాంచర్ల గూడ, కచ్చిరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఏఎంసీ చైర్మన్‌ పాపారావు, సర్పంచ్‌ రాములు, గోపాల్‌, ఇంద్రసేనారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:03:34+05:30 IST