‘మహాలక్ష్మి’తో పేదలకు మేలు
ABN , First Publish Date - 2023-12-10T22:56:48+05:30 IST
ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగపర్చుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి
మహేశ్వరం, డిసెంబరు 10 : ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్న మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, అర్హులైన ప్రతీ ఒక్కరు ఈ పథకాలను తప్పనిసరిగా సద్వినియోగపర్చుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరంలో బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం ఎంపీపీ ఆర్ సునితా అంద్యానాయక్‌లతో కలిసి మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ఈ పథకాలు రాష్ట్రంలోని పేదలందరికీ ఎంతో దోహదపడుతాయన్నారు.
100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో రెండింటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం రెండు రోజుల్లోనే శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే అద్భుతమని బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరంలో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ చేయూత పథకాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబరు 9న రెండు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం విశేషమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ మహమూద్‌అలీ, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, మహేశ్వరం, కందుకూరు ఎంపీపీలు ఆర్.సునితాఅంద్యానాయక్, మంద జ్యోతిపాండు, వైస్ ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కె.రఘుమారెడ్డి, నాయకులు కృష్ణానాయక్, మంత్రి బాల్‌రాజ్, పాండుయాదవ్, కాకి ఈశ్వర్‌ముదిరాజ్, జంగయ్య, అంజయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
చేవెళ్ల : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచి నిర్ణయమని, ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప్రతి ఆవరణలో మహలక్ష్మి, రాజీవ్‌ఆరోగ్యశ్రీ పథకాన్ని చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సౌకర్యం కల్పించడం సంతోకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, షాబాద్ జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ, ఎంపీటీసీ రాములు, తహసీల్దార్ కృష్ణయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్, పార్టీ మండలాధ్యక్షులు ప్రభాకర్, వీరేందర్‌రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్, సమన్వయకర్త సత్యనారాయణరెడ్డి, అధికారులు, నాయకులు, తదితరులు ఉన్నారు.
వంద రోజుల్లో మరో నాలుగు గ్యారంటీల అమలు
ఇబ్రహీంపట్నం : తెలంగాణలో నూతనంగా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం రెండు రోజుల్లోనే చేయూత, మహాలక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకువచ్చిందని మరో నాలుగు గ్యారంటీలను వంద రోజుల వ్యవధిలో అమలు చేస్తామని, యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు సంబంధించి అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందకు కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎంవీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ చేయూత పథకం కింద 85 లక్షల పేద కుటుంబాలకు వైద్య సాయం అందుతుందన్నారు. అంతేకాకుండా మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడమనేది మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి తహసీల్దార్లు అన్వర్, ప్రసాద్‌రావు, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రదత్తు, ఎంపీడీవోలు వెంకటమ్మ, శ్రీనివాస్, జిల్లా ఉప వైద్యాధికారి డా.ధరణికుమార్, ఆర్టీసీ డీఎం వెంకటనర్సప్ప, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, మున్సిపల్ చైర్‌పర్సన్లు స్రవంతి, ఆర్తిక, చెవుల స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తకుర్మ మంగమ్మ, మమత, నీల్ల భానుబాబు తదితరులున్నారు.
రేవంత్‌రెడ్డికి మహిళలు రుణపడి ఉంటారు
కందుకూరు : సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర మహిళలు రుణపడి ఉంటారని, వారికి ఇచ్చిన హామీని అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పేరుతో అమలు చేయడం సంతోషకరంగా ఉందని వైస్ ఎంపీపీ గంగుల శమమంతప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అఫ్జల్‌బేగ్ ఆధ్వర్యంలో నేదునూరులో ఏర్పాటు చేసిన ఆర్‌టీసీ బస్సుకు రగ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పథకాన్ని ప్రారంభించారు. నాయకులు ఎ.బాలయ్య, జి.బలవంత్‌రెడ్డి, పుణ్యమూర్తి శ్రీశైలం, ఎండీ అమీన్ బేగ్, బి.సురేష్, ఎ.సంజీవ, ఎన్ పెంటయ్య, ఎండి పాషా, ఎ.జగన్, భాస్కర్‌రెడ్డి, మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళలు ఉచితప్రయాణంతో మండల కేంద్రం వరకు బస్సులోనే వచ్చారు.
నిరుపేదలకు అండగారాజీవ్ ఆరోగ్యశ్రీ
షాద్‌నగర్ : నిరుపేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా అండగా నిలిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యలు, సిబ్బంది లేక రోగులు అనేక అవస్థలు పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు ఎన్నో నిర్భధానలను ఎదుర్కొన్నారని తెలిపారు. అందుకోసమే 1383 రోగాలకు వైద్య సేవలు, 289 వ్యాధులకు సర్జరీలు చేసేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే మిగతా పథకాలను కూడా ప్రజలకు చేరుస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరావు, షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ శ్రీనివా్‌సరెడ్డితో పాటు ఆర్డీవో వెంకట మాధవరావు జడ్పీటీసీలు వెంకట్‌రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.