సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

ABN , First Publish Date - 2023-03-19T00:13:32+05:30 IST

సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో 10 గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం
కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, తదితరులు

షాబాద్‌, మార్చి 18 : సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో 10 గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఎల్‌.రమణ, జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి కేటీఆర్‌ స్ఫూర్తితో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సొంత ఖర్చుతో పది గ్రామాలకు చెందిన వారికి 100 కుట్టుమిషన్లు అందజేశారు. ఇప్పటికే దివ్యాంగులకు రూ.30లక్షలతో స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం సహకరించకున్నా.. కేసీఆర్‌ సంక్షేమ పథకాలు మాత్రం ఆపడంలేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు వెంకటయ్య, నక్క శ్రీనివా్‌సగౌడ్‌, మండల యూత్‌ అధ్యక్షుడు సతీ్‌షరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌అలీ, సర్పంచులు అర్చనా సుధాకర్‌రెడ్డి, కేతనా రమే్‌షయాదవ్‌, చంద్రశేఖర్‌, జయమ్మ సుదర్శన్‌, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మధుకర్‌రెడ్డి, నాయకులు పొన్న నర్సింహారెడ్డి, దేవెందర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:13:32+05:30 IST