వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-03-19T00:12:09+05:30 IST

మండల కేంద్రంలో శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
షాద్‌నగర్‌ అర్బన్‌ : పల్లకీసేవలో పాల్గొన్న భక్తులు

యాచారం, మార్చి 18 : మండల కేంద్రంలో శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్‌ హాజరుకాగా నిర్వాహకులు సత్కరించారు. ఆలయ చైర్మన్‌ శ్రీనివా్‌సచారి, సర్పంచ్‌ శ్రీధర్‌రెడ్డి, రమే్‌షగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా గోవిందరాజుల స్వామి కల్యాణం

తలకొండపల్లి : మండల పరిధిలోని వెల్జాల శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. సర్పంచ్‌ సంగీత ఆధ్వర్యంలో విశాల వసతులు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ సంగీత, శేఖర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అర్చకుడు యాదగిరి నర్సింహయ్య శాస్త్రి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్‌ సంగీతా శ్రీనివా్‌సయాదవ్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకుడు అయ్యపురెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌సభ్యుడు ముజుబుర్‌ రెహమాన్‌, ఎంపీటీసీ అంబాజీ, తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కడ్తాల్‌ : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ చెన్నకేవ స్వామి దేవాలయ ఆవరణలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫాల్గుణ మాసం చివరి ఏకాదశి నేపథ్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్‌ విగ్రహాన్ని సింధూరంతో అలంకరించారు. సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, అర్చకులు వెంకటేశ్వరశర్మ, శ్రీధర్‌ పంతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

షాద్‌నగర్‌ అర్బన్‌ : షాద్‌నగర్‌ పట్టణానికి ముఖద్వారంగా వెలిసిన శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురష్కరించుకుని శనివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాన పూజారి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో కల్యాణం జరిగింది. అనంతరం పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి పల్లకీ సేవ

షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి కీర్తనలు పాడుతూ పల్లకీ సేవ నిర్వహించారు.

ఈదమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం

మాడ్గుల, మార్చి 18 : మండల కేంద్రంలోని ఈదమ్మ ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని దేవాలయా కమిటీ సభ్యులు కోరారు. ఈమేరకు శనివారం ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, మాడ్గుల ఎంపీటీసీ కొత్త పాండుగౌడ్‌-జ్యోతి దంపతులు రూ.లక్షా 116ల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎంపీటీసీ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-03-19T00:12:09+05:30 IST