వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2023-03-05T00:10:37+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కడ్తాల మండలం రావిచేడ్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
కడ్తాల్‌ : కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, నాయకులు

కడ్తాల్‌ మండలం రావిచేడ్‌కు భారీగా తరలివచ్చిన భక్తులు

కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, నాయకులు

కడ్తాల్‌, మార్చి 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కడ్తాల మండలం రావిచేడ్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణానికి రావిచేడ్‌తో పాటు కడ్తాల, తలకొండపల్లి, ఆమనగల్లు, కందుకూరు , కేశంపేట తదితర మండలాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేంద్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ వేదపండితుడు తిరుమల వింజమూరి రామానుజాచార్యుల పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్త రామచందర్‌రావు ఆధ్వర్యంలో ఆర్చకులు కల్యాణం నిర్వహించారు. అనంతరం గంప లక్ష్మయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డీసీసీబీ డైరెక్టర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు బాచిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ భారతమ్మ విఠలయ్యగౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, ఉప సర్పంచ్‌ వెంకటేశ్‌, తదితరులున్నారు.

భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు : పట్టణంలోని శ్రీ వెంకగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వివిద ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తర లి వస్తున్నారు. శనివారం ఆలయ ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సుంకిరెడ్డిని అర్చకుడు కృష్ణమాచార్యులు సత్కరించారు. సుంకిరెడ్డి వరప్రసాద్‌రెడ్డి, కట్ట దేవేందర్‌శెట్టి, అభివన్‌రెడ్డి, శ్రీరాములు, తదితరులున్నారు.

కల్కిదోన గుట్టపై ఘనంగా చిన్న రథోత్సవం

తలకొండపల్లి : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన తలకొండపల్లి మండలం కల్కిదోన గుట్టపై గల గోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చిన్న రథోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చుక్కాపూర్‌తో పాటు సమీప గ్రామాల భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథంపై దేవతా మూర్తూల ఉత్సవ విగ్రహాలను ఉంచి రథాన్ని తాళ్లతో లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఽఫౌండర్‌ట్రస్టీ, సిద్ధాంతి పట్టాభిరామశర్మ, అర్చకుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆమనగల్లు మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ లు కిష్టమ్మ, స్వప్న భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ వందన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:10:37+05:30 IST