లంచం అడిగితే సమాచారం ఇవ్వండి

ABN , First Publish Date - 2023-09-22T22:38:56+05:30 IST

లంచం డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని తమకు అందిస్తే జైలు ఊచలు లెక్కించేలా చూస్తామని అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి రేంజ్‌ డీఎస్పీ కె.భద్రయ్య అన్నారు.

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి

రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య

వికారాబాద్‌, సెప్టెంబరు22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : లంచం డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని తమకు అందిస్తే జైలు ఊచలు లెక్కించేలా చూస్తామని అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి రేంజ్‌ డీఎస్పీ కె.భద్రయ్య అన్నారు. ఇంతకు ముందు రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీగా పనిచేసిన సూర్యనారాయణకు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించడంతో ఆయన స్థానంలో భద్రయ్య బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతిప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు చిన్న పనికి కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచామని తెలిపారు. వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్‌ చేస్తే కె.భద్రయ్య ఏసీబీ డీఎస్పీ 91543 88971, టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064, ఇన్‌స్పెక్టర్లు 91543 88970, 91543 88968, 91543 88966, 91543 88967లకు కాల్‌ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-09-22T22:38:56+05:30 IST