Share News

ప్రశాంతంగా జీఈఎస్‌టీ పరీక్ష

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:15 PM

మండల పరిధిలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో ఆదివారం నిర్వహించిన గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెసు ్ట(జీఈఎ్‌స టీ) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి 10వ తరగతి పూర్తి చేసిన దాదాపు 1200 మంది విద్యార్థినులు పాలొన్నారు.

ప్రశాంతంగా జీఈఎస్‌టీ పరీక్ష

మొయినాబాద్‌ రూ రల్‌, డిసెంబరు 17: మండల పరిధిలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో ఆదివారం నిర్వహించిన గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెసు ్ట(జీఈఎ్‌స టీ) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి 10వ తరగతి పూర్తి చేసిన దాదాపు 1200 మంది విద్యార్థినులు పాలొన్నారు. ఈమేరకు పరీక్ష కేంద్రం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు పరీక్ష జరిగింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో 25 ర్యాంకుల్లో మెరిట్‌ సాధించి టాప్‌ 10లో మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్‌ విద్యకుగాను నెలకు రూ.5వేల స్కాలర్‌షి్‌పతో పాటు ఉచిత విద్యను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అందించనుందని హిమాయత్‌ నగర్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల డీన్‌ డాక్టర్‌ ఎంవీ రామరావు తెలిపారు. అదేవిధంగా మిగతా 15 ర్యాంకుల్లో మెరిట్‌ సాధించిన వారికి నెలకు రూ.3వేల స్కాలర్‌షిప్‌తో పాటు ఇంటర్‌ విద్యను అందించనున్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పరీక్షకు విశేషస్పందన వచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కొనసాగుతున్న విద్యాసంస్థల్లో అభ్యసించిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారని, ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కోన్నారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 11:15 PM