వాడీవేడిగా మేడ్చల్ సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2023-03-05T00:26:16+05:30 IST
విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
మేడ్చల్ టౌన్, మార్చి4 : విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. ఎంపీపీ రజితరాజమల్లారెడ్డి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్, రెవెన్యూ శాఖల చర్చపై సభ్యులు ఒక్కసారిగా అధికారుల తీరుపై మండిపడ్డారు. గౌడవెల్లి సర్పంచ్ సురేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో 70విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయాల్సిన ఉందని అందుకు పంచాయతీరూ.10లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా విద్యుత్ అధికారులు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని చెరువు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదన్నారు. రాజబొల్లారం తండా సర్పంచ్ మాంగియా నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులను సమస్యలు తెలపడానికి గ్రామసభలకు ఆహ్వానించినా రావటం లేదని ఆరోపించారు. అదేవిధంగా నూతన్‌కల్ ఎంపీటీసీ ఆషాసుల్లాన మాట్లాడుతూ గ్రామంలోని సర్వేనెంబర్ 472లో అక్రమ వెంచర్ వెలిసి కట్టడాలు ప్రారంభించింనా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అదేవిధంగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమారర్టం గదిని తొలగించటంతో స్థాకులకు ఇబ్బందులు పడుతున్నారని మార్కెట్ కమిటీచైర్మన్ భాస్కర్ యాదవ్, సర్పంచ్ మాంగియానాయక్‌లు ప్రస్తావించారు. అదే విదంగా దివ్యాంగుల సదరం సర్టిఫికెట్‌ను కొందరు రూ.20వేల రూపాయలు తీసుకుని ఇప్పిస్తున్నారని జడ్పీటీసీ శైలజవిజయేందర్‌రెడ్డి ఆరోపించారు. స్పందించిన ఎంపీపీ రజిత సభ్యుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన నివేదిక సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజ విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్, మార్కెట్‌కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.