తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతి

ABN , First Publish Date - 2023-08-22T00:08:09+05:30 IST

తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన చరికొండలో సోమవారం చోటుచేసుకుంది.

తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి మృతి

కడ్తాల, ఆగస్టు 21: తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన చరికొండలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చరికొండకు చెందిన గీత కార్మికుడు గూడముళ్ల అబ్బయ్య(50) తాటికల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కాలుజారి చెట్టుపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అబ్బయ్యకు భార్య అండాలు, ఇద్దరు పిల్లలున్నారు. అతడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు ఎస్సై హరిశంకర్‌గౌడ్‌ తెలిపారు. అబ్బయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, సర్పంచ్‌ భారతమ్మనర్సింహాగౌడ్‌, ఎంపీటీసీ రాములు పరామర్శించా రు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-22T00:08:09+05:30 IST