గేట్‌వే ఐటీ పార్కు పనులకు మోక్షం

ABN , First Publish Date - 2023-09-06T23:31:59+05:30 IST

న్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ రింగ్‌రోడ్డు సమీపంలోని గేట్‌వే ఐటీ పార్కు పనులను ఎట్టకేలకు మోక్షం కలిగింది.

గేట్‌వే ఐటీ పార్కు పనులకు మోక్షం

పూజ చేసి పనులు ప్రారంభించిన అధికారులు

మేడ్చల్‌ టౌన్‌, సెప్టెంబరు 6: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ రింగ్‌రోడ్డు సమీపంలోని గేట్‌వే ఐటీ పార్కు పనులను ఎట్టకేలకు మోక్షం కలిగింది. కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు ఐటీ పార్కు పనులు చేపడుతున్న కేబీఆర్‌ ఇన్‌ఫ్రా సీఆర్‌ఓ సుధాకర్‌తో కలిసి బుధవారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మిస్తున్న ఐటీ పార్కుతో మేడ్చల్‌ ప్రాంతం మరో హైటెక్‌ సిటీగా మారనుందన్నారు. సుమారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలులు లభించనున్నాయని తెలిపారు. దాదాపు రెండు వంద కంపెనీలు రానున్నాయన్నారు. ఐటీ పార్కు తయారీకి పూర్తి రూపకల్పన ఇచ్చామని గడువు లోపు అన్ని హంగులతో పార్కును రెడీ చేసెందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ పార్కు ఏర్పాటుతో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఎ్‌సఐఐసీ అధికారులు, కౌన్సిలర్‌ శ్రీలత శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-06T23:31:59+05:30 IST