Share News

చేవెళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:34 AM

చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను చేవెళ్ల కాంగ్రెస్‌ నాయకులు కోరారు. బుధవారం పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

చేవెళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

రాష్ట్ర మంత్రులను కోరిన కాంగ్రెస్‌ నాయకులు

చేవెళ్ల, డిసెంబరు 27 : చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను చేవెళ్ల కాంగ్రెస్‌ నాయకులు కోరారు. బుధవారం పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. చేవెళ్ల ప్రాంతం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. దీంతో మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలుగుట్ట మాజీ సర్పంచ్‌ నర్సింలు, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:34 AM