గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2023-05-26T23:57:57+05:30 IST

మండల పరిధిలోని పిల్లోనిగూడ, పాల్మాకుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నీరటి రాజు అధ్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన నాయకులు శుక్రవారం ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ను వారి నివాసాల్లో కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ఎంపీ రంజిత్‌రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

ఽశంషాబాద్‌ రూరల్‌, మే 26 : మండల పరిధిలోని పిల్లోనిగూడ, పాల్మాకుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నీరటి రాజు అధ్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన నాయకులు శుక్రవారం ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ను వారి నివాసాల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందిస్తూ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు నీరటి రాజు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రవినాయక్‌, ఉపసర్పంచ్‌ కృష్ణ, ప్రవీణ్‌గౌడ్‌, పిల్లోనిగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్‌ పటేల్‌, వార్డుసభ్యులు సుధాకర్‌, నాయకులు నర్సింహ, మహేష్‌, రాజు, వెంకటేష్‌, జమీర్‌, శ్రీశైలం, వేణుమాధవరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-26T23:57:57+05:30 IST