మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్టు చేయాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:31 PM
గిరిజనుల భూములను వారికే ఇస్తానని మాయమాటలు చెప్పి ఆ భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి మల్లారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.బాలమల్లే్‌ష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూడుచింతలపల్లి, డిసెంబరు 14: గిరిజనుల భూములను వారికే ఇస్తానని మాయమాటలు చెప్పి ఆ భూములను కబ్జాచేసిన మాజీ మంత్రి మల్లారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.బాలమల్లే్‌ష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేశవరంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సమాఖ్య, సీపీఐల ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేశవరం గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లలో ఉన్న 47ఎకరాల గిరిజన భూములను మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేయడం అన్యాయమన్నారు. దీనికి తోడు రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రి ఎస్టీల భూములను రిజిస్ట్రేషన్ చేయడమేమిటని వారు ధ్వజమెత్తారు. మల్లారెడ్డి ప్రతీచోట పేదల భూములను కబ్జా చేస్తూ కోట్లకు పడగలెత్తాడని, ఇది తెలంగాణ సమాజానికి అర్థమవుతోందన్నారు. ఆందోళన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్, పార్టీ సహాయ కార్యదర్శి ఉమామహేష్, సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, సంఘాల నాయకులు కృష్ణమూర్తి, హరినాథ్‌రావు, రామారావుగౌడ్, స్వరూప, అజిత్, శ్రీకాంత్‌యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.