రాహుల్‌కు బాసటగా..

ABN , First Publish Date - 2023-03-25T22:58:52+05:30 IST

ఏఐసీసీ నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీపై అక్రమ కేసు పెట్టి జైలుశిక్ష పడిందన్న నెపంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయడం తగదని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే యడమేనంటూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కదంతొక్కారు.

రాహుల్‌కు బాసటగా..
కడ్తాలలో ర్యాలీలో పాల్గొన్న శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, బిచ్యానాయక్‌

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు

రాహుల్‌ లోక్‌సభ సభ్వత్వ రద్దు కక్షసాధింపేనన్న నాయకులు

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/షాద్‌నగర్‌ అర్బన్‌/కొందుర్గు/మొయినాబాద్‌/మాడ్గుల, మార్చి25: ఏఐసీసీ నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీపై అక్రమ కేసు పెట్టి జైలుశిక్ష పడిందన్న నెపంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయడం తగదని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే యడమేనంటూ శనివారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కదంతొక్కారు. మండల కేద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ, బీజేపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆమనగల్లులో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు మండ్లీ రాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాజీవ్‌ కూడ లిలో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ధర్నా చేశారు. డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొం తుకలను నొక్కుతోందని నాయకులన్నారు. బీజేపీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. కార్యక్రమంలో అద్దాల రాములు, మాణయ్య, కృష్ణనాయక్‌, రాఘవేందర్‌, అలీం, రాజశేఖర్‌, ఫరీద్‌, శ్రీధర్‌, అశోక్‌, సురేశ్‌, బాబ, మహేశ్‌, ప్రసాద్‌, ఖా దర్‌ పాల్గొన్నారు. కడ్తాలలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బిచ్యానాయక్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, కో-ఆప్షన్‌ మెంబర్‌ జహాంగిర్‌బాబ హాజరయ్యారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొద్దిసేపు దీక్ష నిర్వహించారు. నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు రామకృష్ణ, ఎక్బాల్‌ పాషా, రాంచందర్‌, రాములు, భావోజీ, శంకర్‌, పాండునాయక్‌, రాము, వెంకటయ్య, మల్లేశ్‌, సత్యం, మల్లయ్య, శేఖర్‌, శ్రీను, అస్గర్‌ అలీ, హీరాసింగ్‌, జవహర్‌లాల్‌, భానుకిరణ్‌, రాజేశ్‌, ఇమ్రాన్‌ వంశీ, రవి, రాజేందర్‌గౌడ్‌, తులసీరాం, విజయ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. తలకొండపల్లిలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు డాకూరు ప్రభాకర్‌రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు మోహన్‌రెడ్డి, అజీం, రవీందర్‌, జనార్ధన్‌రెడ్డి, విష్ణు, ఆరిఫ్‌, చెన్నకేశవులు, రఘుమారెడ్డి, జంగ య్య, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్‌, విష్ణు, శివ, శ్రీనుగౌడ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. భారత్‌ జోడో పాదయాత్రతో దేశ ప్రజల్లో ఐక్యతను తెచ్చిన రాహుల్‌గాంధీకి భయపడే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు దిగిందని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అందె మోహన్‌ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో చేపట్టిన నిరసనలో పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. నరేంద్రమోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశా రు. అలాగే కాంగ్రెస్‌ నాయకుడు ఆలుగడ్డ ప్రవీణ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొందుర్గులోని చౌరస్తాలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గోవర్ధన్‌గౌడ్‌, నరేందర్‌, రవి, మల్లయ్య, రమేష్‌, రామస్వామి, అనిల్‌కుమార్‌, హరిశంకర్‌ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కుట్రపూరితంగానే రద్దుచేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌ అన్నారు. మొయినాబాద్‌లో ఆయన మాట్లాడారు. నాయకులు గౌరీ సతీష్‌, ఎంపీటీసీ రాంరెడ్డి, సత్యనారాయణ, కేబుల్‌ రాజు, శ్రీనివా్‌సయాదవ్‌, మహేందర్‌, జంగారెడ్డి, రియాజ్‌, మల్లే్‌షగౌడ్‌, సంజీవ, బిక్షపతి, రాజుగౌడ్‌, వినోద్‌, కుమార్‌, చంద్రారెడ్డి పాల్గొన్నారు. మాడ్గులలో మాజీ ఎంపీపీ జంగయ్య ఆధ్వర్యంలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు హుస్సేన్‌, భాస్కర్‌, గోవిందరెడ్డి, దళపతి, అంజయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:58:52+05:30 IST