ఉత్సాహంగా ‘ఫుడ్ ఫెస్టివల్’
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:59 PM
మండలంలోని నందివనపర్తి ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఫుడ్ ఫెస్టివల్’ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిళ్లను తయారుచేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
యాచారం, డిసెంబరు 30 : మండలంలోని నందివనపర్తి ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఫుడ్ ఫెస్టివల్’ను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులే స్వయంగా రకరకాల వంటలతో పాటు చిరుతిళ్లను తయారుచేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. బాలబాలికలు బిర్యానీ కూడా తయారు చేశారు. పులిహోర, చికెన్, మటన్‌ఫ్రై, జొన్నరొట్టెలు, నువ్వుల లడ్డూలు, డబుల్‌కామీటా, మంచూరియా, తదితర వంటకాలు చేశారు. ప్రధానోపాధ్యాయులు కిషన్, ఉపాధ్యాయులు కె.భోజయ్య, సురేష్, అజయ్‌రాథోడ్, వెంకటరెడ్డి, మురళీధర్, మల్లీశ్వరీ, సుధారాణి, అరుణ, విజయరాణిలు పరిశీలించి విద్యార్థులను అభినందించారు.