షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:42 PM
షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు అంటుకోగా విలువైన వస్తువులు, నగదు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పూడూరు మండలం చన్‌గోముల్‌లో చోటు చేసుకుంది.
దగ్ధమైన విలువైన వస్తువులు, నగదు
పూడూరు, డిసెంబరు 17: షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు అంటుకోగా విలువైన వస్తువులు, నగదు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పూడూరు మండలం చన్‌గోముల్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చెన్‌గోముల్ గ్రామానికి చెందిన చాకలి రాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగా రాజు కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి పొలానికి వెళాడు. సాయంత్రం పక్కింటి వారు రాజుకు ఫోన్‌చేసి మీ ఇంట్లో మంటలు అంటుకుని పొగలు వస్తున్నాయని సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి వ చ్చి చూడగా, ఇంట్లో ఉన్న టీవీ, రెఫ్రిజిరెటర్, దుస్తులు, వంట సరుకులతోపాటు దుస్తుల కింద దాచిన రూ.80వేల నగదు మంటల్లో దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. సుమారు రూ.లక్ష 50వేల నష్టపోయానని వాపోయాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.