Share News

‘వికసిత్‌ భారత్‌’తో పేదలకు ఆర్థికసాయం

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:04 AM

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ పథకం ద్వారా గ్రామీణ పేదలకు బ్యాంకుల ద్వారా ఆర్థికసాయం అందజేయనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌ తెలిపారు.

‘వికసిత్‌ భారత్‌’తో పేదలకు ఆర్థికసాయం
సమావేశంలో మాట్లాడుతున్న పాండుగౌడ్‌

ధారూరు, డిసెంబరు 22: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ పథకం ద్వారా గ్రామీణ పేదలకు బ్యాంకుల ద్వారా ఆర్థికసాయం అందజేయనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్‌ తెలిపారు. వికసిత్‌భారత్‌ సంకల్ప యాత్రపై శుక్రవారం ధారూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజలకు అవగహన కల్పించారు. ముందుగా సంచార వాహనంలో స్ర్కీన్‌ ద్వారా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంపై ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని 35వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిరువ్యాపారులు, కిరాణ వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరవుతాయన్నారు. లీడ్‌ బ్యాంకు ద్వారా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని బ్యాంకు అధికారులు నామమాత్రంగా నిర్వహించడం సరికాదన్నారు. ధారూరు ఎస్‌బీఐలో బ్యాంకు అధికారుల తీరు సరిగా లేదని, ఖాతాదారులకు సేవలు సరిగా అందడం లేదని కాంగ్రెస్‌ నాయకుడు బాబాఖాన్‌ ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ చంద్రమౌళి, నాయకులు బుజ్జయ్యగౌడ్‌, ఎన్‌. విశ్వనాథం, బాబాఖాన్‌, రవి, రమేశ్‌, రఘు, బ్యాంకు అధికారులు, ప్రజలు, పొదుపు సంఘం మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:04 AM