సరైన పిన్‌కోడ్ వేస్తేనే త్వరగా బట్వాడా
ABN , First Publish Date - 2023-08-08T00:29:51+05:30 IST
సరైన పిన్‌కోడ్ ఉపయోగిస్తే ఉత్తరాల బట్వాడాలో జాప్యం ఉండదని శంషాబాద్ పోస్టుమాస్టర్ జి.శేఖర్‌రెడ్డి అన్నారు.
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 7: సరైన పిన్‌కోడ్ ఉపయోగిస్తే ఉత్తరాల బట్వాడాలో జాప్యం ఉండదని శంషాబాద్ పోస్టుమాస్టర్ జి.శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాల్లో సరైన పిన్‌కోడ్ రాయకుంటే జారీలో జాప్యం ఏర్పడుతుందని, సరైన పిన్‌కోడ్ వేస్తే త్వరాగా బట్వాడా అవుతాయన్నారు. పిన్‌కోడ్ ధారంగానే ఉత్తరాలను ఏయే ప్రాంతాలకు చేరాలో వేరుచేస్తామన్నారు. కాగా సాంతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లి, కిషన్‌గూడ, ఊట్‌పల్లి ప్రజలు పిన్‌కోడ్ తప్పుగా 501218 వేస్తున్నారని. దీంతో జారీలో జాప్యం అవుతోందన్నారు. సాంతంరాయి, గగన్‌పహాడ్ ఎస్‌వీపీఎన్‌పీఏ పోస్ట్‌ఆఫీస్ పరిధిలోకి వస్తాయని, వారు పిన్‌కోడ్ 500025 రాయాలన్నారు. ఊట్‌పల్లి, కిషన్‌న్‌గూడ, తొండుపల్లి, మధురానగర్ నెక్జో షోరూమ్ ఏరియా ప్రజలు 509325 పిన్‌కోడ్ వేయాలని తెలిపారు. ఈ పిన్‌కోడ్ పాలమాకుల పోస్టాఫీస్ పరిధిలోకి వస్తాయన్నారు. ఇందిరానగర్ దొడ్డి, ప్రభుత్వ క్వార్టర్స్ వారు 509325 రాయాలని, ఆర్‌జీఐఏకు ఏరియా వారు 500108 పిన్‌కోడ్ రాయాలని కోరారు. రాఖీపౌర్ణమి వస్తున్నందున సోదరులకు రాఖీలు పోస్టుచేస్తారని, రాఖీలు సకాలంలో చేరాలంటే సరైన పిన్‌కోడ్ నంబర్లు విధిగా వేయాలని ఆయన కోరారు.
పిన్‌కోడ్ తప్పుగా రాయొద్దు
పిన్‌కోడ్ నంబర్లు తప్పుగా రాయొద్దని కాటేదాన్ పోస్ట్‌మాస్టర్ బుచ్చన్న, సిబ్బంది లి.శివకుమార్, ప్రత్యూష, ఎండీ జియాఉల్‌హక్, జె.జాబిల్లి, ఆర్.శివ తెలిపారు. చాలామంది పిన్‌కోడ్ సరిగా వేయడం లేదని, దీంతో ఉత్తరాల బట్వాడాకు జాప్యం అవుతోందన్నారు. మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, శ్రీరాంకాలనీ, నిత్య ఎన్‌క్లో, ఇందిరాగాంధి సొసైటీ(ఐజీఎస్) వాసులు 500005 పిన్ కోడ్ వేయాలని తెలిపారు. శాస్త్రీపురం, కింగ్‌కాలనీ, సైఫ్‌కాలనీ, గగన్‌పహాడ్ వాసులు 500052 నెంబర్ వేయాలన్నారు. దుర్గానగర్ ఎక్స్‌రోడ్, టీఎన్‌జీవోల కాలనీ, పద్మశాలిపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, బొంబై కాలనీ, లక్ష్మీగూడ విలేజ్, మధుబన్‌కాలనీ, సాయిబాబనగర్, బాబుల్‌రెడ్డినగర్, టాటానగర్, నేతాజీనగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ వాసులు 500077 పిన్‌కోడ్‌ను వినియోగించాలని తెలిపారు.