ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో సౌకర్యాలు కల్పించాలి
ABN , First Publish Date - 2023-08-22T00:05:51+05:30 IST
ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్ కాలనీలోని 2వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎండీ సాబేర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఘట్‌కేసర్, ఆగస్టు 21: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్ కాలనీలోని 2వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎండీ సాబేర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా కాలనీలో రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలు పాతి విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా బీ-2లోని కమ్యూనిటీ హాల్‌కు ప్రహరీ లేకపోవడంతో అకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో వరికుప్పల లింగస్వామి, శ్రీనివా్‌సరెడ్డి, రాములు, బంగారు బాబు పాల్గొన్నారు.