‘భగీరథ’ నీటిని అందరూ తాగాలి

ABN , First Publish Date - 2023-05-24T23:59:53+05:30 IST

మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటితో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, అందరూఅవే నీరు తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జడ్పీటీసీ అరుణదేశ్యుచౌహాన్‌ అన్నారు.

‘భగీరథ’ నీటిని అందరూ తాగాలి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ అరుణ దేశ్యుచౌహాన్‌

బొంరా్‌సపేట్‌, మే 24: మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటితో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, అందరూఅవే నీరు తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జడ్పీటీసీ అరుణదేశ్యుచౌహాన్‌ అన్నారు. బుధవారం మండల పరిషత్‌లో ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించారు. తాగు నీటి సరఫరా విభాగ ఏఈ రాఘవేందర్‌ను తాగునీటి సమస్యపై మహంతీపూర్‌ సర్పంచ్‌ మహిపాల్‌, వైస్‌ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్‌, తుంకిమెట్ల ఎంపీటీసీ అరుపతయ్య నిలదీశారు. ఏఈ మాట్లాడుతూ.. నీటి సమస్య ఉన్న చోట్ల బోర్లు వేసి ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ట్యాంకుల నీరు శుభ్రంగా లేవని, ఎలుకలు, బల్లులు, కప్పులు లాంటివి పైపుల్లో చనిపోవడంతో దుర్వాస వచ్చి ప్రజలు నీటిని వాడుకోవ డంలేదని రేగడిమైలారం ఎంపీటీసీ జగదీశ్వర్‌ తెలిపారు. జడ్పీటీసీ అరుణ మాట్లాడుతూ.. నెలలో మూడు సార్లు ట్యాంకులను క్లోరినేషన్‌ చేసేలా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాల న్నారు. పూర్తిగా శుద్ధి చేసిన తరువాతే మిషన్‌ భగీరథ ట్యాంకుల ద్వారా నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారన్నారు. ఏవో పద్మావతి మాట్లాడుతూ సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలు ఇస్తున్నా మని తెలిపారు. మండలంలోని 6 రైతు వేదికల్లో టాయ్‌లెట్లు,ఫ్యాన్‌ సౌకర్యాలు లేవని.. మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నా యని, ప్రజాప్రతినిధులు రైతు వేదికల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు. ట్రాన్స్‌కో ఏఈ మాట్లాడుతూ.. బొంరా స్‌పేట్‌, బుర్రితండా, గిర్కబాయి తండాల్లో విద్యుత్‌ వ్య వస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామా ల్లో ఫార్మేషన్‌ రోడ్లు వేసుకునే అవకాశముందని ఏపీవో మల్లికార్జున్‌ తెలిపారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్ల నిర్మాణం కోసం సర్వే చేపట్టినట్టు తెలిపారు. లేని వారు వాటిని ఏర్పాటు చేసుకోవా లని, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. డీఎల్‌పీవో శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-24T23:59:53+05:30 IST