ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2023-08-02T23:49:21+05:30 IST
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ లావణ్య, కొడంగల్ సీఐ రాములు, బొంరాస్‌పేట్ ఎస్సై శంకర్ అన్నారు.
కొడంగల్ రూరల్, ఆగస్టు 2: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ లావణ్య, కొడంగల్ సీఐ రాములు, బొంరాస్‌పేట్ ఎస్సై శంకర్ అన్నారు. బుధవారం జూనియర్ కళాశాలలో నియోజకవర్గంలోని ఆటో, ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు, యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మూడు రోజుల క్రితం కొడ ంగల్‌లో ఆటోలో పాఠశాలకు వస్తున్న విద్యార్థులను ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తాపడిన గాయపడ్డా రన్నారు. వాహనాల అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు, విద్యార్థులు, ప్రజలను ఎక్కించుకోవడం, అతి వేగం ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. మద్యంతాగి వాహ నాలు నడపడం నేరం అన్నారు. ఇష్టానుసారంవాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే సహించేది లేదన్నారు. అవగాహన సదస్సులో పోలీసు సిబ్బంది, స్కూలు బస్సుల, ప్రైవేట్ వాహనాల డ్రైవర్‌లు, యజమానులు పాల్గొన్నారు.