ప్రాథమిక హక్కులను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-08T23:59:52+05:30 IST

భారత రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి ఈవీ.వేణుగోపాల్‌ అన్నారు.

ప్రాథమిక హక్కులను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న హైకోర్టు జడ్జి ఈవీ.వేణుగోపాల్‌

హై కోర్టు జడ్జి వేణుగోపాల్‌

మేడ్చల్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి ఈవీ.వేణుగోపాల్‌ అన్నారు. గుండ్లపోచంపల్లిలోని డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమేయ పేరుతో తల్లుల సేవలను కొనియాడుతూ ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి జడ్జి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. సమానత్వం, స్వేచ్ఛ, వివక్ష, మతస్వేచ్ఛ, సాంస్కృతిక, విద్య తదితర హక్కులను రాజ్యాంగం పౌరులకు కల్పించిందన్నారు. అమేయ పేరుతో తల్లులను గౌరవిస్తూ వార్షికోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ మనిషికి తల్లి గొప్ప వరం అన్నారు. బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలను సాదడం, పెద్ద చేయడం, సమాజానికి ఉన్నత పౌరులను అందించడం వంటివి తల్లులు చేస్తున్న త్యాగాలన్నారు. ప్రతీ వ్యక్తికి తల్లులే మొదటి ఉపాధ్యాయులన్నారు. మాతృ ప్రేమకు సాటిలేనిదన్నారు. దేశ భవిత విద్యార్థులపైనే ఆధారపడిందన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ శశిఅగర్వాల్‌, కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర నిర్మాత అభిషేక్‌అగర్వాల్‌, స్కూల్‌ చైర్మన్‌ దయానంద్‌అగర్వాల్‌, డైరెక్టర్లు అంజనీకుమార్‌అగర్వాల్‌, సంజయ్‌కుమార్‌, గార్వ్‌, ప్రిన్స్‌పాల్‌ షణ్ముగం పరమశివన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T23:59:53+05:30 IST