ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:35 PM
అధికారులు ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలని కేశంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ నర్సింహయాదవ్ డిమాండ్ చేశారు.
కేశంపేట మాజీ వైస్‌ఎంపీపీ నర్సింహ యాదవ్
కేశంపేట, డిసెంబరు 18: అధికారులు ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలని కేశంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ నర్సింహయాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని, వాటిని తక్షణమే సరి చేయాలని కోరారు. ఓకే ఇంట్లోని ఓటర్లు వేర్వేరు వార్డులో ఉన్నట్లు తెలిపారు. ఓటరుకు ఆధార్ అనుసంధానం చేయాలని కోరారు. గ్రామాల్లో ఓటు హక్కు లేనివారి పేర్లు తొలగించాలని తెలిపారు. రెండు చోట్ల ఓటరు పేరు ఉన్నట్లు గుర్తిస్తే.. ఒకచోట తొలగించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు.