బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-05-26T23:47:05+05:30 IST

బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌ అన్నారు.

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
కులకచర్ల: మాట్లాడుతున్న ఎంపీపీ సత్యహరిశ్చంద్ర

కులకచర్ల/పూడూరు, మే 26: బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నతనంలోనే పెళ్లిలు చేయడంతో ఎన్నో అనర్థాలు, మనస్పర్థలు ఏర్పడతాయని వివరించారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లిలు చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మాయికి 18, అబ్బాయికి 21సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలని ఊచించారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసేందుకు సిద్ధమైతే చైల్డ్‌లైన్‌ 1098కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఐసీడీఎస్‌ సీడీపీవో ప్రియదర్శిని, తహసీల్దార్‌ రమేశ్‌, ఎస్‌ఐ శ్రీశైలం, ఎంపీడీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేశ్‌, చైల్డ్‌లైన్‌ అధికారులు ఆంజనేయులు, రాంచంద్రయ్య ఐసీడీఎస్‌ మండల సూపర్‌వైజర్‌ యాదమ్మ, అంగన్‌వాడీ టీచర్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా పూడూరు మండలంలోని సోమన్‌గుర్తి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోక్సో చట్టం తదితర వాటిపై కిషోర బాలికలకు అవగాహన కల్పించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రసన చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఎల్‌.సంధ్య, ఎంపీటీసీ సిరిదేవిక, నర్సిములు, ఆశాకార్యకర్తలు షహేనాజ్‌, వైద్యులు సనా ఫాతిమా, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్లా, అంగన్‌వాడీ టీచర్‌లు అరుణదేవి, ప్రభావతి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:47:05+05:30 IST