ఉపాధి హామీ పనులు భేష్‌

ABN , First Publish Date - 2023-06-07T23:50:49+05:30 IST

యాచారం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులు భేషుగ్గా ఉన్నాయని ఆ పథకం రాష్ట్ర విజిలెన్స్‌ సెల్‌ అధికారులు ఉమారాణి, ఉష, డ్వామా అదనపు ప్రాజెక్టు అధికారి నీరజ అన్నారు.

ఉపాధి హామీ పనులు భేష్‌
పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

యాచారం, జూన్‌ 7 : యాచారం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులు భేషుగ్గా ఉన్నాయని ఆ పథకం రాష్ట్ర విజిలెన్స్‌ సెల్‌ అధికారులు ఉమారాణి, ఉష, డ్వామా అదనపు ప్రాజెక్టు అధికారి నీరజ అన్నారు. బుధవారం వారు మండల కేంద్రంలో బృహత్‌ పల్లె ప్రకృతివనం, క్రీడాప్రాంగణాలను పరిశీలించారు. అంతకుముందు మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి పనులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తీరు చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో చెట్లు బాగా ఏపుగా పెరగడం చూసి పంచాయతీ, ఉపాధి హామీ పథకం అధికారులను అభినందించారు. వారివెంట మండల ఏపీవో లింగయ్య, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-06-07T23:50:49+05:30 IST