ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
ABN , First Publish Date - 2023-11-22T00:20:16+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతీ పోలీస్ పని చేయాలని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి సూచించారు. పరిగిలో మంగళవారం ఎన్నికల బందోబస్తుపై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.

పరిగి, నవంబరు 21: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతీ పోలీస్ పని చేయాలని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి సూచించారు. పరిగిలో మంగళవారం ఎన్నికల బందోబస్తుపై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుత విఽధులతోపాటు, పోలింగ్ రోజును నిర్వహించే విధుల పట్ల అప్రమత్తతతో ఉండాలని సూచించారు. సున్నితమైన, అతిసున్నితమైన గ్రామాల్లో బందోబస్తు మరింత పకడ్బందీగా ఉండాలన్నారు. సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుందన్న విషయాన్ని ఓటర్లకు వివరించాలని సూచించారు. పోలింగ్‌స్టేషన్‌లకు సెల్‌ఫోన్‌లు, కెమెరాలు, వీడియో రికార్డింగ్‌లు చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఓటర్లు, పోలింగ్ సిబ్బందితో సమన్వయపరిచి ప్రశాంతం జరిగేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ఫోటోలు, వీడియోలు, అసత్య ప్రచారాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ వెంకటరామయ్య పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ బుధవారం పరిగిలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభ బందోబస్తుపై సమీక్షించారు.