కాంగ్రెస్‌ బీసీసెల్‌ మండల అధ్యక్షుడిగా ఎన్నిక

ABN , First Publish Date - 2023-09-16T23:32:33+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ బీసీసెల్‌ కోట్‌పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నారం మాజీ సర్పంచ్‌ మందుల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కాంగ్రెస్‌ బీసీసెల్‌ మండల అధ్యక్షుడిగా ఎన్నిక
ఎన్నికైనట్లు పత్రాన్ని అందజేస్తున్న మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌

బంట్వారం(కోట్‌పల్లి), సెప్టెంబరు 16: కాంగ్రెస్‌ పార్టీ బీసీసెల్‌ కోట్‌పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నారం మాజీ సర్పంచ్‌ మందుల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నివాసంలో శనివారం ఎన్నికైనట్లు పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్ష్షుడు దుద్యాల లక్ష్మణ్‌లకు శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాహీద్‌ మియా, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌ నాయక్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అయిబ్‌ అన్సారీ, రాంచందర్‌రెడ్డి(టిల్లు), ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బిచ్చిరెడ్డి, అంజయ్య, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మాదవ్‌, శశికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-16T23:32:33+05:30 IST