Share News

విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:38 PM

మండలంలోని చెరువు ముందలి తండా(కే)లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వృద్ధురాలు మృతగిచెందింది. తండాకు చెందిన వృద్దురాలు మాణిక్యమ్మ (68) ఆదివారం వంటగదికి ఉన్న గ్రిల్స్‌ పట్టుకుంది.

విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
మృతురాలు మాణిక్యమ్మ

కులకచర్ల, డిసెంబరు 17: మండలంలోని చెరువు ముందలి తండా(కే)లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వృద్ధురాలు మృతగిచెందింది. తండాకు చెందిన వృద్దురాలు మాణిక్యమ్మ (68) ఆదివారం వంటగదికి ఉన్న గ్రిల్స్‌ పట్టుకుంది. వాటికి విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌ తగిలింది. పక్క ఇంట్లో జరిగే పెళ్లి కోసం వీరి ఇంట్లో నుంచి విద్యుత్‌ సరఫరాకు తీగలు వేశారు. గ్రిల్స్‌ దగ్గర విద్యుత్‌ వైర్‌ తెగిపోయి తేలింది. గమనించని మాణిక్యమ్మ గ్రిల్స్‌ పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:38 PM