Share News

విద్యానగర్‌ కాలనీ అభివృద్ధికి కృషి : కసిరెడ్డి

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:58 PM

మున్సిపాలిటీలోని విద్యానగర్‌ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

విద్యానగర్‌ కాలనీ అభివృద్ధికి కృషి : కసిరెడ్డి
బతుకమ్మలతో ఎమ్మెల్యే కసిరెడ్డికి స్వాగతం పలుకుతున్న కాలనీ వాసులు

ఆమనగల్లు, డిసెంబరు 24: మున్సిపాలిటీలోని విద్యానగర్‌ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విద్యానగర్‌ కాలనీలో ఆదివారం కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంఏ పాషా అధ్యక్షతన జరిగిన ఆత్మీయ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీ సింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌన్సిలర్‌ సోని జయరామ్‌, కాలనీ అధ్యక్షుడు పాషా, సంయుక్త కార్యదర్శి మ్యాక వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వర్కాల శేఖర్‌, ప్రధాన కార్యదర్శి మానపాటి జంగయ్య, కోశాధికారి జిల్ల్లెల్ల సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు కసిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. అంతకుముందు కాలనీ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యానగర్‌ కాలనీ వాసులు ఏళ్ల కాలంగా ఎదుర్కొంటుకున్న దేవాదాయ శాఖ భూ వివాదం పరిష్కారం కావడం సంతోషదాయకమని, అందుకు కృషి చేసిన కాలనీ అధ్యక్షుడు పాషాను ఎమ్మెల్యే అభినందించారు. నాయకులు, కాలనీ వాసులు ఎండపల్లి నారాయణ, యాచారం వెంకటే శ్వర్లు గౌడ్‌, అప్పం శ్రీను, తెల్గమల్ల జగన్‌, వస్పుల మానయ్య, వెంకట్‌ రెడ్డి, బికుమాండ్ల శ్రీనివాస్‌, పాండునాయక్‌, పర్వతాలు, తదితరులున్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డ్డికి టీడీపీ నేతల సన్మానం

కసిరెడ్డికి నగరంలోని ఆయన నివాసంలో టీడీపీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గ టీడీపీ కో-ఆర్డినేటర్‌, రాష్ట్ర టీడీపీ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి అండేకార్‌ యాదిలాల్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ టీడీపీ కోశాధికారి అర్థం నర్సింహల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని సన్మానించారు. సీనియర్‌ నాయకులు పంచాక్షరి, కండె సత్యం, రాజిరెడ్డి, తదితరులున్నారు. ఆమనగల్లు చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు కోట కృష్ణయ్య, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌, మాజీ అధ్యక్షుడు జూలూరి రమేశ్‌, తదితరులు కలిసి ఎమ్మెల్యేను సత్కరించారు. అలాగే మాడ్గుల మండలం దిల్‌వార్‌ఖాన్‌పల్లి గ్రామస్తులు కసిరెడ్డిని కలిసి సత్కరించారు. నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీ సింగ్‌, సుద్దపల్లి సర్పంచ్‌ వెంకటేశ్వర్లుగౌడ్‌, సూదిని శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, చందు, వెంకటయ్య, పాపిరెడ్డి, కిరణ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:58 PM