రాష్ట్రంలో మెరుగైన పాలనకు కృషి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:27 PM
ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఆమనగల్లు, డిసెంబరు 18: ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రజా పాలనలో పేదలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పలు శాఖల అధికారులు సోమవారం కసిరెడ్డి నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించి అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. ప్రజలు నిర్భయంగా తమ కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా త్వరలో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆమనగల్లు బ్లాక్ కాంగ్రె్‌స్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మాడ్గుల మండలాధ్యక్షుడు భట్టు కిషన్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు గండికోట మల్లేశ్, కాలె మల్లయ్య, పూసల సత్యం, సూదిని శ్రీనివాస్‌రెడ్డి, జంతుక యాదయ్య, జగన్, బొజ్జ వెంకట్రామ్ రెడ్డి, సుదాకర్ రెడ్డి, వడ్డే తిరుపతయ్య, సురేశ్ గౌడ్, మద్దూరి శ్రీనివాసులు, పాండు గౌడ్, వెంకటేశ్, నర్సింహ, నరేందర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.