‘అగ్రకుల పార్టీలకు అభిముఖంగా ‘డీఎస్పీ’
ABN , First Publish Date - 2023-03-05T00:17:53+05:30 IST
తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో అగ్రకుల పార్టీల జెండాలకు అభిముఖంగా ఒక్క డీఎస్పీ జెండా మాత్రమే నిలబడబోతోందని దళిత్‌శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు.
మంచాల, మార్చి 4 : తెలంగాణ భవిష్యత్ రాజకీయాల్లో అగ్రకుల పార్టీల జెండాలకు అభిముఖంగా ఒక్క డీఎస్పీ జెండా మాత్రమే నిలబడబోతోందని దళిత్‌శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. స్వరాజ్య పాదయాత్ర మంచాల మండలంలో శనివారం కొనసాగింది. తాళ్లపల్లిగూడ, చిత్తాపూర్, మంచాల, ఆరుట్ల, చాంద్‌ఖాన్‌గూడ, అస్మత్‌పూర్, జాపాల గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10శాతం కూడా లేని రెడ్డి, వెలమలకు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు.. 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక్క రాజకీయ పార్టీ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. లక్ష్మన్, జిల్లా అధ్యక్షుడు రాకేష్, మండల కన్వీనర్ ఆనంద్, తదితరులున్నారు.