పొడిగా మార్చి.. బంగారం అక్రమ తరలింపు
ABN , First Publish Date - 2023-05-25T22:43:56+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని పొడిగా మార్చి అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 686గ్రాములు స్వాధీనం
శంషాబాద్ రూరల్, మే 25 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని పొడిగా మార్చి అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రయాణికుడు గురువారం తెల్లవారుజామున మస్కట్ నుంచి డబ్ల్యూవై 231 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఈక్రమంలో అఽధికారులు అతన్ని తనిఖీ చేయగా, పొడిగా మార్చిన 686 గ్రాముల బంగారాన్ని రహస్యభాగాల్లో పెట్టుకుని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు. బంగారం విలువ రూ.42.78 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అధికారులు పట్టుబడిన బంగారాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.