Share News

చిన్నారిపై వీధి కుక్కల దాడి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:42 AM

వీధి కుక్కల దాడిలో ఓ 11 నెలల చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మేడ్చల్‌ జిల్లా కీసరలో జరిగింది.

చిన్నారిపై వీధి కుక్కల దాడి

తీవ్ర గాయాలు.. నిలోఫర్‌కు తరలింపు

కీసర, డిసెంబరు 27: వీధి కుక్కల దాడిలో ఓ 11 నెలల చిన్నారికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మేడ్చల్‌ జిల్లా కీసరలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుదర్శన్‌ కుటుంబంతో వలస వచ్చి కీసర అనుబంధ గ్రామంలో ఉంటున్నాడు. అతడు కప్రెషర్‌ ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం సుదర్శన్‌ కూతురు గీత(11 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు కుక్కలను తరిమేశారు. చిన్నారి మూతిని కుక్కలు కరవడంతో గాయాలయ్యాయి. చిన్నారిని ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అవి మనుషులపై గుంపులుగా దాడిచేస్తున్నాయని, వాటి బెడదను నివారించాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:42 AM