మా గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలపొద్దు

ABN , First Publish Date - 2023-08-01T00:32:03+05:30 IST

తమ గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలుపొద్దని మల్కాపూర్‌, దేవునిఎర్రవల్లి, ఊరెళ్ల గ్రామస్తులు సోమవారం వేర్వురుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఆర్డీవో సాయిరామ్‌లకు వినతిప్రతాలు అందజేశారు.

మా గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలపొద్దు
మంత్రి సబితారెడ్డికి వినతిప్రతం ఇస్తున్న మల్కాపూర్‌ గ్రామస్తులు

చేవెళ్ల, జూలై 31: తమ గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలుపొద్దని మల్కాపూర్‌, దేవునిఎర్రవల్లి, ఊరెళ్ల గ్రామస్తులు సోమవారం వేర్వురుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఆర్డీవో సాయిరామ్‌లకు వినతిప్రతాలు అందజేశారు. మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్‌ సమన్వయ అధ్యక్షుడు చింపుల సత్యనాయణరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు కానున్న చేవెళ్ల మున్సిపాలిటీలో తమ గ్రామాలను విలీనం చేయొద్దని, పంచాయతీలుగానే ఉంచాలని కోరారు. తాము చేవెళ్ల మున్సిపాలిటీకి అడ్డుకాదన్నారు. మున్సిపాలిటీలో కలిపితే గ్రామాలు అభివృద్ధి చెందవన్నారు. కార్యక్రమంలో పామెన మాజీ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ జాఫర్‌, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, నాయకులు లింగాచారి, విక్రమొద్దీన్‌, పురుషోత్తం, శివ, అశోక్‌, శంకరయ్య, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్‌, గోపాల్‌, మధుసూదన్‌రెడ్డి, బక్కయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-08-01T00:32:03+05:30 IST