చెక్‌డ్యాం వద్ద నిల్వ నీరు డైవర్షన్
ABN , First Publish Date - 2023-03-19T00:05:10+05:30 IST
పాత తాండూరులో నీటి నిల్వ కోసం 2014లో నిర్మించిన చెక్ డ్యాం పక్క నుంచి నీరు వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కాల్వ తవ్వారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు
ఇసుక అక్రమార్కుల పనేనని ఆరోపణలు
తాండూరు, మార్చి 18: పాత తాండూరులో నీటి నిల్వ కోసం 2014లో నిర్మించిన చెక్ డ్యాం పక్క నుంచి నీరు వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కాల్వ తవ్వారు. ఇది ఎవరు ఎందుకు తవ్వారన్నది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం చెక్ డ్యాం నిర్మాణం వల్ల రెండు మీటర్ల పొడవు, 8ఫీట్ల లోతు వరకు నీటి నిల్వ ఉంది. ఈనీటి నిల్వ వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగిపోయాయి. 2014నుంచి కూడా ఇప్పటి వరకు జలకళతో ఉంది. ఇటీవల అట్టి చెక్ డ్యాం పక్క నుంచి జేసీబీతో కాల్వను తవ్వి నీటిని తరలించడంపై ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ జరిపారు. చెక్‌డ్యాం ఎక్కడాచెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ చెక్ డ్యాం పక్క నుంచి కాల్వ తీసి నీటిని తరలించడంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఉన్న నీటిని తగ్గించి ఇసుక తవ్వకాలు జరిపేందుకే ఇసుక అక్రమార్కుల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఇసుక అక్రమార్కుల పనేనని సామాజిక వేత్త రాజ్‌గోపాల్ సార్డా ఆరోపించారు.