రాయితీపై కంది విత్తనాల పంపిణీ

ABN , First Publish Date - 2023-06-26T23:36:51+05:30 IST

జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథకం కింద రాయితీపై వచ్చిన కంది విత్తనాలను సోమవారం మండలంలోని రేగడిమైలారంలో గల రైతు వేదికలో రైతులకు అందజేశారు.

రాయితీపై కంది విత్తనాల పంపిణీ
బొంరా్‌సపేట్‌: రేగడిమైలారంలో విత్తనాలను అందజేస్తున్న వ్యవసాయ అధికారి హేమ

బొంరా్‌సపేట్‌, జూన్‌ 26: జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథకం కింద రాయితీపై వచ్చిన కంది విత్తనాలను సోమవారం మండలంలోని రేగడిమైలారంలో గల రైతు వేదికలో రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ గోవింద్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బంటు శేఖర్‌, శ్యామలయ్యగౌడ్‌, ఏఈవో హేమ, రైతులు పాల్గొన్నారు.

ధారూరు: జాతీయ ఆహారభద్రత పథకం ద్వారా ఎంపీపీ విజయలక్ష్మి రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు. ధారూరు రైతు వేదికలో సోమవారం పీఆర్‌జీ-176 రకం కంది విత్తనాలను ఆమె రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఏడీఏ వినోద్‌కుమార్‌, ధారూరు సర్పంచ్‌ చంద్రమౌళి, వైస్‌ ఎంపీపీ విజయ్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, ఏఎంసీ చైర్మన్‌ సంతోష్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పి.బసప్ప, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ వెంకటయ్య, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పి.చెన్నయ్య, ఎఈవోలు సంజూ, హరిప్రసాద్‌, మంజుల, త్రైలోక్య, మల్లేశం పాల్గొన్నారు.

బషీరాబాద్‌: జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద మండలానికి 44క్వింటాళ్ల కందులు, 7 క్వింటాళ్ల మినుములు వచ్చాయని వ్యవసాయాధికారి సూర్యప్రకాష్‌ తెలిపారు. ఈ విత్తనాల పంపిణీ కొన్ని క్లస్టర్లలో సోమవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. రైతు వేదికల క్లస్టర్ల పరిధిలోని ఆయాగ్రామాల రైతులు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులను అందజేసి విత్తనాలు పొందవచ్చన్నారు. ఒక్కో రైతుకు నాలుగు కిలోల బ్యాగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

తాండూరు రూరల్‌: తాండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో పేద రైతులకు జాతీయ ఆహార భద్రత పథకం కింద కందులు, మినుములు, సోయాబీన్‌ వంటి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌ రైతు వేదిక వద్ద సోమవారం ఏడు క్వింటాళ్ల కంది విత్తనాలను సిరిగిరిపేట్‌ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, మాజీ వైస్‌ఎంపీపీ శేఖర్‌, శివరాం పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:36:51+05:30 IST