టీడీపీ హయాంలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-03-05T00:16:28+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ పేదల అభివృద్ధి, సంక్షేమాల గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

టీడీపీ హయాంలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి
పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తున్న బక్కని నర్సింహులు

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు

నందిగామ, మార్చి 4: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ పేదల అభివృద్ధి, సంక్షేమాల గురించి పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. శనివారం నందిగామలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త గతంలో టీడీపీ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ కార్యకర్తలంతా కృషిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్‌ బలంగా ఉందనీ, కొంచెం శ్రమిస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జిల్లెల బాల్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, కుందారపు రాంరెడ్డి, ఏకుల కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:16:28+05:30 IST