టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి
ABN , First Publish Date - 2023-03-02T00:12:52+05:30 IST
టీడీపీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని టీడీపీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి దివాకర్ అన్నారు.
మర్పల్లి, మార్చి 1: టీడీపీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని టీడీపీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి దివాకర్ అన్నారు. టీడీపీ పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండలంలోని సిరిపురం, వీర్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. పట్వారీ, పటేల్ వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించేలా చేసింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాపిరెడ్డి, రఘువీరాగౌడ్, వెంకటయ్య, జయరాజ్, లింగంగౌడ్, రవి, మాజీ సర్పంచ్ పాండునాయక్, మాజీ ఎంపీటీసీ శేఖర్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కొడంగల్ కో ఆర్డినేటర్‌గా వెంకటప్రసాద్
కొడంగల్: టీడీపీ కొడంగల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా కోస్గికి చెందిన సామల వెంకటప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేస్తూ నియామక పత్రం అందించినట్లు వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంబదాస్, మల్లేశ్, వెంకటేశ్, అంజిలయ్య, మద్దూర్ రవి, కొత్తపల్లి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.