Share News

అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2023-11-22T00:10:08+05:30 IST

అభివృది,్ధ సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం నందిగామ మండల పరిధిలోని అయ్యప్ప మందిరం, జంగోనిగూడ, అంతిరెడ్డిగూడ, నర్సప్పగూడ, వెంకమ్మగూడ, చేగుర్‌, బండోనిగూడ గ్రామాల్లో అంజయ్యయాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రోడ్‌షోలో పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష
నందిగామ : అంజయ్యను గజమాలతో స్వాగతిస్తున్న నాయకులు

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

నందిగామ, నవంబరు 21: అభివృది,్ధ సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం నందిగామ మండల పరిధిలోని అయ్యప్ప మందిరం, జంగోనిగూడ, అంతిరెడ్డిగూడ, నర్సప్పగూడ, వెంకమ్మగూడ, చేగుర్‌, బండోనిగూడ గ్రామాల్లో అంజయ్యయాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేగూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం అంధకారంలో ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 ఏళ్లు పాలించి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మనం వెనుకబడి పోతామన్నారు. గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తుందని అన్నారు. జడ్పీవైస్‌ చైర్మన్‌ గణేష్‌, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ నవీన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ వి.నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ విఠల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీటీసీ కళమ్మ, సర్పంచులు వెంకట్‌రెడ్డి, సంతోష, నర్సింలు, గోవిందుఅశోక్‌, నాయకులు రామన్న, జనార్ధన్‌రెడ్డి, విక్రమ్‌శర్మ, రాజ్యలక్ష్మి, వీరెందర్‌, బేగ్‌, సుధాకర్‌, సంతోష్‌, విజయ్‌, నీలమ్మ, నర్సింహ, రఘు, గణేష్‌, రవిందర్‌, సాయి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కారు గుర్తుకే ఓటు వేయండి

కేశంపేట : కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరుతూ మండలంలో అన్ని గ్రామాల్లో అంజయ్య యాదవ్‌కు మద్దతుగా నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌ రెడ్డి నేతృత్వంలో ప్రచారం కొనసాగుతోంది. అంజన్నను గెలిపిస్తే మంత్రి అవుతారని, ఓటర్లు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సజ్జల విశ్వనాథం, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్‌, అల్వాల శంకరయ్య గౌడ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, ప్యాక్స్‌ వైస్‌ చైర్మన్‌ అంజిరెడ్డిలు పాల్గొని విస్తృత ప్రచారం నిర్వహించారు.

బీజేపీలో గుర్తింపు లేకనే బీఆర్‌ఎస్‌లో చేరిక

చౌదరిగూడ : బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం లేకపోవడం వల్లనే బీఆర్‌ఎస్‌లో చేరానని ఉమ్మడి కొందుర్గు మండల సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌, కిసాన్‌ మోర్చా బీజేపీ రాష్ట్ర నాయకులు పటోళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కేశంపేట ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌ను కలిసి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ సుస్థిర పాలన ఒక్క బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతోనే తాను బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని తెలిపారు.

అభివృద్ధికి ఓటేద్దాం.. అంజన్న గెలిపిద్దాం

రాష్ట్రంలో కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి అంజన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మండలాధ్యక్షుడు అన్నారు. మంగళవారం చౌదరిగూడ మండల కేంద్రంలో అంజయ్య యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్లతో మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. సర్పంచ్‌ వెంకటస్వామి, డైరెక్టర్‌ జబ్బార్‌, వెంకటేష్‌, అక్రం, అన్వర్‌, ఇస్మాయిల్‌, శివ, జానయ్య, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:10:09+05:30 IST