మూడు ఇసుక ఫిల్టర్ల ధ్వంసం

ABN , First Publish Date - 2023-03-19T00:08:53+05:30 IST

మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లపై శనివారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు.

మూడు ఇసుక ఫిల్టర్ల ధ్వంసం

తలకొండపల్లి, మార్చి18: మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లపై శనివారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామంలో కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల వద్ద ఇసుక ఫిల్టర్లు ఏర్పాటుచేసి కృత్రిమంగా ఇసుక తయారు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో పలు మార్లు అధికారులు హెచ్చరికలు చేశారు. నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఏఆర్‌ఐ మంజుల ఆధ్వర్యంలో ఫిల్టర్లపై దాడులు నిర్వహించారు. మూడింటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇసుక ఫిల్టర్లు నిర్వహించినా, ఇసుక అక్రమ రవాణా చేపట్టినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ కృష్ణ హెచ్చరించారు. భూముల్లో ఇసుక నిల్వచేసిన పట్టాదారులపైన, మట్టి తవ్వకాలకు సహకరించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2023-03-19T00:08:53+05:30 IST