అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN , First Publish Date - 2023-09-22T00:06:13+05:30 IST
మండల పరిధిలోని చిన్నగోల్కొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం ఆర్‌ఐ సంజీవ అధ్వర్యంలో జేసీబీతో కట్టడాలను కూల్చివేశారు.
శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 21 : మండల పరిధిలోని చిన్నగోల్కొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం ఆర్‌ఐ సంజీవ అధ్వర్యంలో జేసీబీతో కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, కబ్జా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బంది బాల్‌రాజ్, వెంకటేష్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.