రాష్ట్రంలో ‘ప్రజాపాలన’
ABN , Publish Date - Dec 31 , 2023 | 11:47 PM
ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
ఆమనగల్లు, డిసెంబరు 31: ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాజకీయాలు, అక్రమాలకు చోటు లేకుండా ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎమ్మెల్యే కసిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. అసంపూర్తి పనులు, స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజా ప్రతినిధుల ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలన లో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రగతి ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అసంపూర్తి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలుపుతామన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, మాజీ జడ్పీటీసీ అశోక్‌రెడ్డి, నాయకులు సూదిని కొండల్‌రెడ్డి, మెకానిక్‌బాబా, జయరామ్, విజయ్‌రాథోడ్, అంజన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, ఎంఈవో సర్ధాన్ నాయక్, ఎంపీడీవో వెంకట్రాములు, సూపరింటెండెంట్ రమేశ్ నాయక్, తదితరులున్నారు.