Share News

కార్యదీక్షను బట్టే కర్మఫలం

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:02 AM

కార్యదీక్ష, నడవడిక, సత్యశీలతలను బట్టే కర్మఫలితం ఉంటుందని ప్రముఖ రచయిత, సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. శివ తత్వాన్ని అనుసరించి పత్రీజీ చూపిన ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానంతో ముందుకు సాగేవారు ఆనందమయ జీవనం పొందుతారన్నారు.

కార్యదీక్షను బట్టే కర్మఫలం
ధ్యాన వేడుకల్లో మాట్లాడుతున్న రచయిత, నటుడు తనికెళ్లభరణి

ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి

ఐదో రోజుకు ధ్యాన మహాయాగం వేడుకలు

కడ్తాల్‌, డిసెంబరు 25: కార్యదీక్ష, నడవడిక, సత్యశీలతలను బట్టే కర్మఫలితం ఉంటుందని ప్రముఖ రచయిత, సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. శివ తత్వాన్ని అనుసరించి పత్రీజీ చూపిన ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానంతో ముందుకు సాగేవారు ఆనందమయ జీవనం పొందుతారన్నారు. అన్మా్‌సపల్లి కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయగం వేడుకలు-2 కొనసాగుతున్నాయి. సోమవారం ఐదో రోజు భారీగా ధ్యానులు, సాధ కులు, పిరమిడ్‌ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు తరలివచ్చారు. పిరమిడ్‌ స్పిర్చ్యువల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కొర్పోలు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తనికెళ్ల భరణి, పీఎ్‌సఎ్‌సఎమ్‌ గ్లోబల్‌ వ్యవస్థాపకురాలు, పరిమళ పత్రి తదితరులు హాజరయ్యారు. ఉదయం జామున 5 నుంచి 8గంటల వరకు సంగీత ధ్యానం నిర్వహించారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ట్రస్ట్‌ నిర్వాహకులు కేక్‌ కట్‌చేసి క్రిస్మస్‌ సందేశమిచ్చారు. భరణి మాట్లాడుతూ.. మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం ధ్యాన మార్గమన్నారు. 30ఏళ్ల క్రితం ఆయన ప్రారంభించిన ధ్యాన విప్లవం విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. పరిమళ పత్రి మాట్లాడుతూ.. ధ్యానంతో సహనం, యోగం, సంకల్పశక్తి సిద్ధిస్తాయన్నారు. విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్రీజీ శక్తిస్థల్‌, విగ్రహం ఏర్పాటుకు పిరమిడ్‌ మాస్టర్లు, ధ్యానులు సహకరించాలని కోరారు. కాగా మహాపిరమిడ్‌ ప్రాంగణం ధ్యాన సంద్రంగా మారింది. సోమవారం రికార్డుస్థాయిలో జనం తరలివచ్చారు. ధ్యాన మహాయాగంలో భాగంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరించాయి. యువతుల, విద్యార్థినులు, యువకుల నృత్యరూపకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు పరిణతి పత్రి, రాంబాబు, మాధవి, నిర్మలదేవి, శ్రీరామ్‌గోపాల్‌, కిషన్‌రెడ్డి, అన్మా్‌సపల్లి సర్పంచ్‌ శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:02 AM