26న చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్‌ సభ

ABN , First Publish Date - 2023-08-22T23:29:48+05:30 IST

ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన డిక్లరేషన్‌ సభను నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు.

26న చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్‌ సభ
మాట్లాడుతున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ఆగస్టు 22: ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన డిక్లరేషన్‌ సభను నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చేవెళ్లలో నిర్వహించే దళిత, గిరిజన డిక్లరేషన్‌ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారన్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణకు వికారాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారన్నారు. 24న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వికారాబాద్‌ జిల్లాలో పర్యటించి సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారన్నారు. 24న ఉదయం 10గంటలకు తాండూరు, 12గంటలకు వికారాబాద్‌, 4గంటలకు పరిగి, 6గంటలకు చేవెళ్లలో రేవంత్‌రెడ్డి సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మురళీ, నాయకులు అనంత్‌రెడ్డి, కిషన్‌ నాయక్‌, రెడ్యానాయక్‌, అనంతయ్య, రఘుపతిరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:29:48+05:30 IST