తహసీల్దార్ కార్యాలయానికి కరెంట్ కట్
ABN , First Publish Date - 2023-01-26T00:09:27+05:30 IST
ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 8 నెలలకు సంబంధించి రూ.71,083 విద్యుత్ బిల్ చెల్లించాల్సి ఉంది.
రూ. 71,083 విద్యుత్ బకాయిలు
సరఫరాను నిలిపివేసిన విద్యుత్ శాఖ
రెండు గంటలు నిలిచిన సేవలు
ఆమనగల్లు, జనవరి25 : ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 8 నెలలకు సంబంధించి రూ.71,083 విద్యుత్ బిల్ చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని నెలల తరబడి విద్యుత్‌శాఖ అధికారులు తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరుతున్నా స్పందన లేదు. దీంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్ ఆదేశానుసారం ఏఈ సీతారామ్ సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో 2గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. తహసీల్దార్ జ్యోతి విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, వారం రోజుల్లో బిల్లు చెల్లిస్తామన్న అధికారుల హామీ మేరకు తిరిగి విద్యుత్ సరఫరా చేశారు.