కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్టీల క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-03-30T23:40:06+05:30 IST

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌(సీఆర్టీల)కు 12 నెలల వేతనం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో గురువారం కులకచర్ల చౌరస్తాలో కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్టీలు క్షీరాభిషేకం చేశారు.

కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్టీల క్షీరాభిషేకం
కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

కులకచర్ల, మార్చి 30: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌(సీఆర్టీల)కు 12 నెలల వేతనం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో గురువారం కులకచర్ల చౌరస్తాలో కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్టీలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు సీఆర్టీలకు 10నెలల వేతనమే చెల్లించేది. ఇకపై సమ్మర్‌ సాలరీ సైతం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డిలను సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రాంరెడ్డి, రాజు, కృష్ణయ్యగౌడ్‌, సీఆర్టీల సంఘం నాయకులు మహేశ్‌కుమార్‌, మంజుల, అరవింద్‌, రాజు, చందర్‌, అనసూయ, గోపాల్‌, శ్రావణి, మంగమ్మ, పాండు, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T23:40:06+05:30 IST