పంట రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలి
ABN , First Publish Date - 2023-03-18T23:57:40+05:30 IST
రైతులు పంటరుణాలను ఇన్‌టైంలో రెన్యూవల్స్ చేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందని ఎస్బీఐ రీజీనల్ ఛీప్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు.

పరిగి,మార్చి 18: రైతులు పంటరుణాలను ఇన్‌టైంలో రెన్యూవల్స్ చేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందని ఎస్బీఐ రీజీనల్ ఛీప్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు. పరిగి ఎస్బీఐ(ఏడీబీ) శాఖ పరిధిలోని రూఫ్‌ఖా్‌పపేట్ గ్రామంలో శనివారం ఫీల్డ్ ఆఫీసర్ కలీమొద్దీన్ ఆధ్వర్యంలో పంటరుణాల రెన్యూవల్(సంద్యశిబిరం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడుపు లోపు చెల్లిస్తే పంటరుణాలకు వడ్డిలో రాయితీ ఉంటుందన్నారు. రైతులు బ్యాంకులకు రాకపోవడంతో గ్రామాల్లోని రైతుల ఇంటి వద్దకే వెళ్ళి పంట రుణాల రెన్యూవల్స్ చేయిస్తున్నామని తెలిపారు. ఏళ్ళతరబడి చెల్లించకుండా(ఎన్‌పీఏ) కింద అన్ని రకాల రుణాలు సకాలంలో చెల్లించని వారికి వడ్డీ, జరిమానాలు భారంగా మారుతాయన్నారు. ఏళ్ళుగా చెల్లించిన రుణాలకు సంబంధించి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని తెలిపారు. ఈ అవకాశం మార్చి 31 వరకు ఉంటుందన్నారు. సామాజిక భద్రత పథకాలైన అటల్ పెన్షన్ యోజన, ప్రధాని జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ పరిగి బ్రాంచి చీఫ్ మేనేజర్ అనుప్రభ, ఫీల్డ్ అఫీసర్ ఎంకే ఖలీమోద్దీన్, సర్పంచ్ ఐ.నర్సింహ, రైతులు పాల్గొన్నారు.
రుణాలు సకాలంలో చెల్లించాలి
బంట్వారం: దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు రైతులు సకాలంలో చెల్లించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాంచంద్రా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘంలో రైతులు వారు తీసుకున్నా రుణాలు సకాలంలో చెల్లిస్తే వాటికి రీబీట్ వస్తుందన్నారు. సకాలంలో చెల్లించని రైతులకు వడ్డీ పడుతుందని సూచించారు. సంఘం తరఫున ఇప్పటి వరకు 146మంది రైతులకు 2.5కోట్లకు పైగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇచ్చామన్నారు. వారు సకాలంలో చెల్లించేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. గత సంవత్సరం దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఈమార్చి 31 లోగా చెల్లించాలన్నారు. రైతులకు వచ్చే పంటల సీజన్‌లో అన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్‌చైర్మన్ సుధాకర్ గౌడ్, డైకెక్టర్లు మధుసుదన్ రెడ్డి, సుధర్శన్ రెడ్డి, సిబ్బంది బ్రహ్మం, రాములు, శ్రీనివాస్, నర్సిములు నరేందర్ పాల్గొన్నారు.