ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ

ABN , First Publish Date - 2023-08-02T00:05:23+05:30 IST

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం కులకచర్ల పీఎ్‌సను ఆయన సందర్శించి రికార్డులు, పోలీ్‌సస్టేషన్‌ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించారు.

 ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ
కులకచర్ల పీఎస్‌ను సందర్శించిన వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

కులకచర్ల, ఆగస్టు 1: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం కులకచర్ల పీఎ్‌సను ఆయన సందర్శించి రికార్డులు, పోలీ్‌సస్టేషన్‌ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సహకారం అందించడంలో పోలీసులు ముందుండాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పీఎ్‌సకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగేలా సంబంధిత గ్రామ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసులు ప్రజలతో మమేకంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ వెంకటరామయ్య, ఎస్సై శ్రీశైలం, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ అధికారుల సంక్షేమం కోసం కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు

వికారాబాద్‌ రూరల్‌: జిల్లాలోని పోలీస్‌ అధికారుల సంక్షేమం కోసమే నూతన కోఆపరేటివ్‌ సోసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ సూపరిండెంట్‌ కార్యాలయంలో జిల్లా కోఆపరేటివ్‌ సోసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారుల సంక్షేమం కోసమే వికారాబాద్‌ జిల్లా కోఆపరేటిఆవ్‌ సొసైటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సోసైటీలో 7మంది కార్యవర్గసభ్యులు, 800 మంది సభ్యులు ఉన్నారని, ఏవైన సమస్యలు ఉంటే నేరుగా సభ్యులను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. సొసైటీ అధ్యక్షుడిగా జిల్లా ఎస్పీ, ఉపాధ్యక్షుడిగా అదనపు ఎస్పీలను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీశ్రీనివా్‌సరావు, ఏఆర్‌ డీఎస్పీ వీరేశం, ఇన్‌స్పెక్టర్‌ రాజు, వెంకటేశం, అశోక్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-02T00:05:23+05:30 IST