Share News

షార్ట్‌సర్క్యూట్‌తో పత్తి పంట దగ్ధం

ABN , First Publish Date - 2023-12-05T23:31:12+05:30 IST

మండలంలోని పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ధనసిరి నర్సింహారెడ్డి ఇంట్లో నిల్వ చేసిన పత్తి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

షార్ట్‌సర్క్యూట్‌తో పత్తి పంట దగ్ధం

తాండూరు రూరల్‌, డిసెంబరు 5: మండలంలోని పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ధనసిరి నర్సింహారెడ్డి ఇంట్లో నిల్వ చేసిన పత్తి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్సింహారెడ్డి తన పొలంలో పండించిన 23 క్వింటాళ్ల పత్తి పంటను ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచారు. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా, పత్తి నిల్వ చేసిన గదిలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన ఇరుగుపొరుగు వారు నర్సింహారెడ్డి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నీళ్లు చల్లి పంటకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల పత్తిపంట దగ్ధమైందని, తనకు న్యాయం చేయాలని బాధిత రైతు నర్సింహారెడ్డి కోరాడు.

Updated Date - 2023-12-05T23:31:13+05:30 IST